Sai Pallavi: సౌత్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన సాయి పల్లవి తన సహజమైన నటనతో అందంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సాయి పల్లవి గత కొంతకాలంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తాను సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణం గురించి వివరించింది. సాయి పల్లవి చివరిగా గార్గి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నిర్మాతలు కూడా భారీగానే నష్టపోయారు. ఇక ఆ సినిమా తర్వాత సాయి పల్లవి మరొక సినిమాలో నటించలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఆ విషయం గురించి మాట్లాడుతూ..”నేను నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాల వల్ల నిర్మాతలు చాలా నష్టపోయారు. సినిమా అనేది నిర్మాతలను కాపాడాలి కానీ వారిని నష్టపరిచేలా ఉండకూడదు అని తెలిపింది.
Sai Pallavi: నిర్మాతలు నష్టపోవడం ఇష్టం లేదు…
అంతే కాకుండా..” నావల్ల నష్టపోయిన కూడా కొందరు నిర్మాతలు మళ్లీ నాతో సినిమా చేయటానికి ముందుకు వస్తున్నారు. కానీ పదే పదే వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు.లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా వేరే మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తాను” అంటూ తన వల్ల నష్టపోయిన నిర్మాతల గురించి ఎమోషనల్ అయింది. దీంతో సాయి పల్లవి మంచి మనసు తెలిసి ఆమె అభిమానులు ఆనంద పడుతున్నారు. తన వల్ల ఇతరులు నష్టపోకూడదు అన్న భావనతో సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉందని తెలిసి ఆమె అభిమానులు గర్వపడుతున్నారు. కానీ సాయి పల్లవి మళ్లీ ఒక మంచి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రావాలని అభిమానులు ఆశపడుతున్నారు.