Saipallavi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతో మంది ఎన్నో కలలు కంటూ ఉంటారు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినవారు అనంతరం మంచి బ్యానర్లలో స్టార్ సెలబ్రెటీల సరసన సినిమాలు చేసే అవకాశం వస్తే చాలని కలలు కంటూ ఉంటారు కానీ ఇలాంటి అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి అని చెప్పాలి. ఎలాంటి పెద్ద బ్యానర్ అయిన ఎలాంటి బడా హీరో అయినా ఈమె కథ నచ్చితే మాత్రం సినిమాలకు కమిట్ అవుతుంది అనే సంగతి మనకు తెలిసిందే.
ఇలా కథ నచ్చకపోయినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా ముందు ఎలాంటి స్టార్ ఉన్నప్పటికీ సాయి పల్లవి నిర్మొహమాటంగా సినిమాని రిజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలోనే ఓ పెద్ద బ్యానర్లో తనకు సినిమా చేసే అవకాశం వచ్చిందట అయితే స్వయంగా దర్శక నిర్మాతలే తనకు ఫోన్ చేసి మరి అవకాశం కల్పించడంతో ఈమె మాత్రం చాలా సులభంగా తాను నటించాను అంటూ కుండబద్దలు కొట్టి చెప్పేశారు మరి ఈమె రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏంటి దర్శకుడు ఎవరు అనే విషయానికి వస్తే…
ఆ సినిమాని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..
సాయి పల్లవి సినిమాలలోకి రాకముందు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా నాలుగవ సీజన్లో ఈ షోలో సాయి పల్లవిని చూసినటువంటి శేఖర్ కమ్ముల ఈమె కోసం ఒక కథ సిద్ధం చేశారట అయితే స్వయంగా సాయి పల్లవి తల్లి గారి నెంబర్ కనుక్కొని ఆమెకు ఫోన్ చేసి మీ అమ్మాయికి నా తదుపరి సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పినప్పటికీ సాయి పల్లవి మాత్రం నేను ఇప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వెళ్ళనని తాను పూర్తిగా మెడిసిన్ చేయాలి అంటూ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. అయితే శేఖర్ కమ్ముల మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించారని తెలుస్తుంది. అయితే అప్పుడు కాదన్నటువంటి సాయి పల్లవి తిరిగి శేఖర్ కమ్ముల ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.