Sai Pallavi: ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సాయి పల్లవి గురించి అందరికీ సుపరిచితమే.ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేశారు. ఇలా సాయి పల్లవి అద్భుతమైన నటన డాన్సులతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసారు.ఈ క్రమంలోనే ఈమెకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని తనకు తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చాయి.ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సాయిపల్లవి తాజాగా రానా సరసన విరాటపర్వం అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరోక్షంగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ తను మాంసాహారం తినననీ,అయితే తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి కోసం స్వయంగా మార్కెట్ వెళ్లి మాంసాహారం తీసుకువచ్చి తనకు వండి పెట్టానని తెలిపారు.

Sai Pallavi: ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్న సాయి పల్లవి…
అయితే ఆ వ్యక్తి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అని ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చారు.ఈ విధంగా సాయి పల్లవి తనకు నచ్చని పనిని తనకు ఇష్టమైన వ్యక్తి కోసం చేయడంతో ఈమె అతనితో ప్రేమలో ఉంది అంటూ చాలామంది ఈ వ్యాఖ్యల పై పలు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈమె ప్రేమిస్తున్న ఆ హీరో ఎవరు ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.అయితే అతను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని, త్వరలోనే సాయిపల్లవి ఆ వ్యక్తితో తనకు ఉన్న ప్రేమ గురించి బయట పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తారని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈమె ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు మాత్రం ఎంతో ఆత్రుత పడుతున్నారు.