Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పనిలేదు హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి పల్లవి నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈమెకు మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ లకు తావు లేకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ తన నటన నాట్యం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడం సాయి పల్లవికే చెల్లింది. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఆచితూచి అడుగులు వేస్తూ ఎంతో మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాయి పల్లవి తనకు ఇష్టమైనటువంటి టాలీవుడ్ హీరో గురించి చెప్పడమే కాకుండా ఆ హీరో కోసం తాను ఇంట్లో తన్నులు కూడా తిన్నాననే విషయాన్ని బయట పెట్టారు.ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఇంటర్ చదువుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలయితే ఇంట్లో వారికి తెలియకుండా సినిమా చూడటం కోసం థియేటర్ కు వెళ్లానని తెలిపారు.
Sai Pallavi: ఇంట్లో చెప్పకుండా సినిమా చూడటానికి వెళ్ళాను…
ఇలా సినిమా చూసి రావడానికి చాలా ఆలస్యమైంది అప్పటికే తనకోసం ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. ఇక నేను ఇంటికి రాగానే తన తండ్రి వెనుక ముందు ఆలోచించకుండా తనని బాగా కొట్టారని సాయి పల్లవి తెలిపారు.సినిమాకు వెళ్లానని చెప్పడంతో నీకు సినిమా అంతగా నచ్చితే మాకు చెప్పొచ్చు కదా మేం తీసుకెళ్తాం ఇలా ఒంటరిగా వెళ్లడం దేనికి అంటూ చివాట్లు కూడా పడ్డాయని సాయి పల్లవి తెలిపారు.తనకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమని ఆయన ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటూ కూడా సాయి పల్లవి తెలిపారు. ఇక తనని నేరుగా ఫిదా సినిమా షూటింగ్ సమయంలోనే కలిశానని ఈ సందర్భంగా సాయి పల్లవి పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.