Sai Pallavi: రేపు కలుస్తానన్నా సాయి పల్లవి.. పెళ్లి పుకార్లపై ఫుల్ క్లారిటీ?

Akashavani

Sai Pallavi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్న ఈ అమ్మడు ఆ పై పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఈ నాచురల్ బ్యూటీ నటిస్తే.. అచ్చం తెలుగింటి ఆడపడుచులా.. మన ఇంటి పక్కన కుటుంబం లో జరిగే స్టోరీ లా అనిపిస్తుంది. మొత్తం లవ్ స్టోరీలే ఎంచుకుంటూ వరుసగా హిట్ లను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ ఫిదా బ్యూటీ. ఇక గత సంవత్సరం నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది.

ఆ సినిమాలో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకుల మతులు పోగొట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడు ఏ సినిమాను చేయడానికి అంగీకరించలేదు. ఎన్నో రోజులు అవుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ తన మూవీ అప్ డేట్స్ సోషల్ మీడియాలో కూడా వెల్లడించలేదు. కాగా కొందరు ఈ బ్యూటీ పెళ్లికి రెడీ అవుతుందని వార్తలు ప్రచారం చేశారు.

Sai Pallavi: రేపు కలుస్తానన్నా సాయి పల్లవి.. పెళ్లి పుకార్లపై ఫుల్ క్లారిటీ?
Sai Pallavi: రేపు కలుస్తానన్నా సాయి పల్లవి.. పెళ్లి పుకార్లపై ఫుల్ క్లారిటీ?

Sai Pallavi: సాయి పల్లవి పెళ్లి పుకార్ల కు ఈ విధంగా బ్రేక్ ఇచ్చింది!

ఇక తాజాగా సాయి పల్లవి ఈ వార్తలకు బ్రేక్ ఇచ్చింది. తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ నెట్టింట్లో పంచుకుంది. చాలా కాలంగా ఆమె ఒక సర్ప్రైజ్ ను దాస్తుంది. నాకు తెలిసి ఈ సోమవారం మిమ్మల్ని చూడటానికి సిద్ధమైనది అంటూ.. ఒక ఫోటో ను టాగ్ చేసింది. ఆ ఫోటోలో చీర కట్టుకున్న ఓ పల్లెటూరు ఆడపిల్ల బ్యాగు పట్టుకొని గాల్లో ఎగురుతూ కనిపించింది.

ప్రస్తుతం సాయి పల్లవి పంచుకున్న ఈ స్నాప్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ షేర్ చేసి 20 గంటల పూర్తి కాగా నాలుగు లక్షల 12 వేల 642 ఇష్టాలను పొందింది.

- Advertisement -