Saidharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న విరూపాక్ష టీం తాజాగా జబర్దస్త్ కామెడీ షో లో సందడి చేసింది. తాజాగా సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, డైరెక్టర్ కార్తీక్ దండు జబర్దస్త్ షోలో పాల్గొని సందడి చేశారు.
ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ జబర్దస్త్ యాంకర్ ని ఒక ఆట ఆడుకున్నాడు. తాజాగా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ వీడియోలో సాయిధరమ్ తేజ్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇవ్వగానే.. చీర కట్టులో అందంగా మెరిసిపోతున్న యాంకర్ సౌమ్య రావు మీద సెటైర్లు వేశాడు. సాయి ధరమ్ తేజ్ సౌమ్య రావు వైపు చూస్తూ ఏంజిల్స్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నా అని అంటాడు. దీనితో సౌమ్య రావు సిగ్గుతో మురిసిపోయింది. అయితే వెంటనే సాయిధరమ్ తేజ్..మీ గురించి కాదు లేండి అని అనడంతో ఒక్కసారిగా గాలి తీసినట్లు డల్ అయ్యింది.
Saidharam Tej: ఏంజెల్ అంటూ పరువు తీసిన హీరో…
ఆ తర్వాత రాకెట్ రాఘవ సాయిధరమ్ తేజ్ ని సాయిధరమ్ తేజ్ ని పొగడబోయి పరువు తీసుకున్నాడు. రాకెట్ రాఘవ సాయి ధరంతేజ్ గురించి మాట్లాడుతూ.. సర్.. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాము అని భజన చేయటం ప్రారంభించాడు. దీంతో పక్కనే ఉన్న కమెడియన్ రియక్ట్ అవుతూ.. చెప్పుతో కొడతా.. ఎవర్ని చూస్తూ ఎవరు పెరిగారు అంటూ రాఘవ వయసు గుర్తు చేశాడు. ఇలా మొత్తానికి జబర్దస్త్ షోలో సాయిధరమ్ తేజ కూడా తనదైన శైలిలో జోకులు , పంచులు వేస్తూ సందడి చేసారు. ఈ ఈ ప్రోమో కి సంబంధించిన ఎపిసోడ్ ఏప్రిల్ 20న ప్రసారం కానుంది.