Saidharam Tej: మెగా కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి ధరంతేజ్ తను నటించిన మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, విన్నర్ వంటి సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఇటీవల సాయి ధరంతేజ్ బైక్ ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో తీవ్ర గాయాల ధరమ్ తేజ్ చాలా కాలం చికిత్స తీసుకున్న తర్వాత ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఈ ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ కి పునర్జన్మ అని చెప్పవచ్చు.
తాజాగా ఈ ప్రమాదం గురించి సాయి ధరంతేజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..” తాను ఆ ప్రమాదాన్ని ఓ పీడకలగా భావించడం లేదని, అదొక గుణపాఠం , ఓ స్వీట్ మెమరీ అని చెప్పుకొచ్చాడు. ఆ ప్రమాదం తర్వాత తాను చాలా నేర్చుకున్నానని, ముఖ్యంగా మాట విలువ తెలిసిందని చెప్పుకొచ్చాడు. ప్రమాదానికి ముందు తాను ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడినని కానీ హాస్పిటల్ బెడ్ మీద మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడే తనకు మాట విలువ తెలిసిందని చెప్పాడు.
Saidharam Tej: మాట విలువ తెలిసింది..
ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ తనకు ఎంతో అండగా ఉండి ధైర్యం చెప్పారని, మళ్ళీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరమని తన తల్లి బైక్ ఎక్కించిందని చెప్పుకొచ్చాడు. తనకు ఎంత మంది ఆప్తులు వున్నారో, తన కోసం ఎంత మంది ప్రార్థించారో తెలిసిన తరువాత ఇది కదా తాను సంపాదించిన ఆస్తి అని అర్థం అయిందని ఎమోషనల్ అయ్యాడు. అందుకే అందరినీ నవ్విస్తూ, అందరితో కలిసి మెలిసి వుంటూ, జీవితాన్ని గడపాలి ఫిక్స్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు” . ఇక ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది.