Saidhram Tej: మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా హీరోగా మారిన సాయి ధరంతేజ్ మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఇటీవల సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల సాయిధరమ్ తేజ్ చాలాకాలం సినిమాలకు దూరం అయ్యాడు.
అయితే ఆ ప్రమాదం నుండి పూర్తిగా కోలుకున్న ధరమ్ తేజ్ తిరిగి సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యాడు. ఇక ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి ధరమ్ తేజ్ చేతికి జపమాల ధరించి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రమాదం నుండి కోలుకుని బయటకు వచ్చిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ఇలా రుద్రాక్ష మాలతో కనిపిస్తున్నాడు. ఇదివరకే సమంత సాయి పల్లవి కూడా ఇలా జపమాలతో కనిపించారు. సాయి పల్లవికి భక్తి ఎక్కువ . అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు రుద్రాక్ష మాల తీసుకు వెళుతుంది.
Saidhram Tej: మానసిక ప్రశాంతత కోసం…
ఇక నాగచైతన్య ఎక్కువ దూరమైన తర్వాత సమంతలో కూడా భక్తి భావం పెరిగిపోయింది. ఇక ఇటీవల మయోసైటిస్ బారి నుండి బయటపడిన సమంత కూడా మొదటిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు రుద్రాక్ష మాలతో కనిపించింది. భయాన్ని పోగొట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి సమంత రుద్రాక్ష మాలను ధరిస్తుంది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా తన భయాన్ని పోగొట్టి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ఆ ఇద్దరి హీరోయిన్ల బాటలోనే ఇలా రుద్రాక్ష మాల ధరించాడని సమాచారం. రుద్రాక్ష మాలతో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.