Saipallavi: ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అందువల్ల ఈ అమ్మడికి మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో వరుసగా స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు అందుకొని సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. సాధారణంగా హీరోయిన్గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందాలు దాచుకోకూడదు. ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని అవకాశాలు వస్తాయి.
కానీ సాయి పల్లవి మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన సహజమైన అందం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో తప్ప రెమ్యునరేషన్ ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేని గ్లామర్ పాత్రలలో నటించడానికి అంగీకరించదు. ప్రస్తుతం హీరోయిన్లు అందం కోసం లక్షలు లక్షలు డబ్బులు వెచ్చించి సర్జరీలు చేయించుకుంటుంటే సాయి పల్లవి మాత్రం తన సహజమైన అందంతో కనీసం మేకప్ కూడా వేసుకోకుండా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Saipallavi: కాలికి సర్జరీ చేయించుకున్న సాయి పల్లవి…
ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకాలం సర్జరీలకు దూరంగా ఉన్న సాయి పల్లవి తన బాడీలో ఒక పార్ట్ కి సర్జరీ చేయించుకున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాయి పల్లవి సర్జరీ చేయించుకున్నది అందం కోసం కాదట. సాయి పల్లవి కి డాన్స్ అంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు కాలుకి చిన్న గాయమైందని ..ఆ టైంలోనే ఆమె సర్జరీ చేయించుకోవలసి వచ్చిందని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ.. సాయి పల్లవి డాన్స్ చేసేప్పుడు ఆ కాలు నొప్పి వస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ అందులో ఎంత నిజం ఉందో తెలీదు మరి.