Saipallavi: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సాయి పల్లవి ఒకరు ఈమె నేచురల్ బ్యూటీగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన కథా సినిమాలను ఎంపిక చేసుకొని తన సహజ నటనతో అందరిని మెప్పిస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి బాటలోని తన చెల్లెలు పూజా కన్నన్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె సముద్రఖని హీరోగా నటించిన చితరై సవ్వనం అనే సినిమాలో హీరోయిన్ గా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇలా ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి ఈమెకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోయినా ఇందులో ఈమె నటనకు మాత్రం అందరూ ఫిదా అయ్యారు. ఇలా ఈ సినిమాలో పూజ నటనతో అందరిని మెప్పించడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఒక స్టార్ హీరో మాత్రం పూజ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారట. రాత్రిపూట తనతో అసభ్యకరమైన మెసేజెస్ పెడుతూ తనని ఎంతగానో హింసించారని తెలుస్తుంది.
Saipallavi: అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారా..
ఈ విధంగా ఆ హీరో తనని వేధించడంతోఈ విషయం తన అక్క సాయి పల్లవికి చెప్పగా సాయి పల్లవి మరుసటి రోజు ఆ హీరో నటిస్తున్నటువంటి సినిమా షూటింగ్ లోకేషన్ కు వెళ్లి మరి తన చెల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె అందరి ముందు తనని దారుణంగా అవమానించి మాట్లాడారని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి ఆ హీరో పట్ల అందరు చీ కొట్టారట. ఇలా కెరియర్లో ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో పూజా కన్నన్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో ఆమె భయపడే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.