Salaar: కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకేక్కుతున్న సినిమా “సలార్”. ఈ సినిమాలో ప్రభాస్ శృతిహాసన్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బయటికి వచ్చింది సలార్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న దేవరాజ్ సలార్ సినిమా అప్డేట్ గురించి నోరు జారారు. ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దేవరాజ్ ప్రస్తుతం సలార్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవరాజ్ సలార్ సెకండ్ పార్ట్ గురించి సీక్రెట్ రీవిల్ చేశాడు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..” ప్రస్తుతం తాను సలార్ లో నటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో సినిమా గురించి యాంకర్ ప్రశ్నించగా ఆ విషయాలు తాను చెప్పలేనని, కాకపోతే ఆ సినిమాలో తన పాత్ర మొదటి భాగంలో కన్నా రెండవ భాగంలోనే ఎక్కువగా ఉంటుందని నోరు జారాడు. ఇప్పటికే సలార్ సినిమా గురించి అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గతంలో సలార్ సినిమా ఉగ్రం రీమేక్ అని నోరు జారాడు. అయితే ఇది ఉగ్రం రీమేక్ కాదని తరువాత ప్రశాంత్ నీల్ కవర్ చేయటానికి ప్రయత్నం చేశాడు.
Salaar: సలార్ సీక్వెల్ గురించి నోరు జారిన నటుడు…
ఇక ఇప్పుడు దెవరాజ్ కూడా సలార్ సెకండ్ పార్ట్ ఉండబోతుంది బయటపెట్టాడు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా గురించి ఒక్కో సీక్రెట్ బయటకి రావటంతో ప్రశాంత్ నీల్ మాత్రం తల పట్టుకుంటున్నాడు.గతంలో కూడా సలార్ సినిమా రెండు భాగాలుగా ఉండబోతుందని వార్తలు బయటకి వచ్చాయి. ఈ విషయం మీద కేజీయఫ్ 2 సినిమా ప్రమోషన్స్‌లో ప్రశాంత్ నీల్ కూడా స్పందించాడు. ఒక వేళ సలార్ రెండు పార్టులుగా ఉంటే.. దాన్ని సరైన టైం, సరైన విధానంలో చెబుతామని ప్రశాంత్ నీల్ గతంలో వెల్లడించాడు. అయితే ఇప్పుడు దేవరాజ్ అసలు విషయాన్ని నోరు జారి చెప్పేశాడు.