Samantha: సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమాలలో భాగంగా ఈమె కేవలం సినిమా విశేషాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని గత రెండు సంవత్సరాలుగా తన జీవితంలో చాలా జరుగుతున్నాయి అంటూ ఎమోషనల్ అయ్యారు.
గత రెండు సంవత్సరాల క్రితం నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వబోతున్నానని తెలియజేశారు ఇలా విడాకుల వార్తలను విన్నటువంటి సమంతా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఈ విడాకుల విషయం నుంచి కోలుకున్న ఈమె తిరిగి సినిమా షూటింగ్ పనులతో బిజీ అయ్యారు.ఇలా సమంత తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న తరుణంలో మాయోసైటిసిస్ అనే భయంకరమైన వ్యాధి తనని చుట్టుముట్టింది. ఇలా ఈ వ్యాధి కారణంగా సమంత పూర్తిగా బెడ్ కి పరిమితమయ్యారు.
Samantha:
ఇలా ఈ విషయాలన్నింటి గురించి ఈమె తలుచుకొని గత రెండు సంవత్సరాలుగా నా జీవితంలో ఎన్నో జరుగుతున్నాయని తెలియజేశారు. అయితే కేవలం తన పని తిరిగి తనని నిలబెట్టిందని ఈమె తెలియజేశారు. నేను సాధారణంగా దేనిని నా పని పై ప్రభావితం కానివ్వను అయితే నేను బెడ్ పైనుంచి పైకి లేవలేక పోతే తప్ప.. కానీ గత కొన్ని నెలలుగా తన విషయంలో ఇదే జరుగుతుందని సమంత తన కష్టాలను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.అయితే తాను అలాంటి పరిస్థితులలో ఉన్న సమయంలో ప్రొడక్షన్ వారు అభిమానులు తనకు ఎంతో మద్దతు ఇస్తూ తనని ప్రోత్సహించారని ఆ ప్రోత్సాహమే తనని తిరిగి తొందరగా కోలుకునేలా చేసింది అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.