Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.అయితే సమంత నాగచైతన్యతో మనస్పర్ధలు కారణంగా అతనికి విడాకులు ఇచ్చినప్పటికీ ఆ కుటుంబ సభ్యులతో మాత్రం సన్నిహితంగానే ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అక్కినేని సుశాంత్ అఖిల్ సినిమాలను ప్రమోట్ చేయడం అలాగే దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కూడా ఈమె సోషల్ మీడియాలో ముచ్చట్లు పెట్టడం వంటివి చూస్తుంటే ఈ కుటుంబాలతో ఈమె సన్నిహితంగానే ఉన్నారని తెలుస్తోంది.
ఇకపోతే నేడు అఖిల్ పుట్టినరోజు కావడంతో సమంత సోషల్ మీడియా వేదికగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అఖిల్ నేడు తన 29వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో సమంత సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే అఖిల్ అక్కినేని.. ఎయ్.. ఏజెంట్ 28న రాబోతుంది చూస్తుంటే ఫైర్ లా ఉంది. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ హార్ట్ ఎమోజీలను జత చేసి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం సమంత చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు సమంతకు తన మరిదిపై ఇంత ప్రేమ ఉందా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Samantha: అఖిల్ రిప్లై ఏంటో…
అయితే సమంత గత ఏడాది కూడా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అఖిల్ ఏ విధమైనటువంటి రిప్లై ఇవ్వలేదు. తాజాగా ఈ ఏడాది కూడా సమంత తిరిగి అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారు. మరి ఈసారైనా మాజీ వదిన చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు మరిది రిప్లై ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక సమంత కూడా ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానుంది.