Samantha: సమంత..నెటిజన్స్‌కి, సోషల్ మీడియాకి గత ఏడాది నుంచి మంచి న్యూస్ కంటెంట్ అయిపోయింది. ఆమె సినిమాకి సంబంధించిన విషయాలే కాదు, వ్యక్తిగత విషయాలను బూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అప్‌డేట్ ఇస్తే ఓ రకంగా వార్తలు..ఇవ్వకపోతే ఇంకో రకమైన వార్తలు రాసేసి నానా రచ్చ చేస్తున్నారు. ఇటీవల తన సినిమాల గురించి రక రకాల వార్తలు రాసిన సోషల్ మీడియా ఇప్పుడు సద్గురు సమంతకి రెండవ పెళ్లి చేయబోతున్నారని ప్రచారం చేస్తున్నారు.
దీనికి ముందు సమంత అనారోగ్యం బారిన పడిందని ఆసుపత్రిపాలైందని రాసుకొచ్చారు. ఇప్పుడేమో అమెరికా వెళ్ళినట్టు ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజులు అమెరికాకి వెళ్ళి రెస్ట్ తీసుకొని వస్తుందట..అని చెబుతున్నారు. అంతేకాదు, అక్కడేదో ట్రీట్ మెంట్ కూడా తీసుకోనుందని ఇప్పుడు వస్తున్న వార్తల సారాంశం. అయితే, సమంత అమెరికాకి వెళ్ళింది హాలీవుడ్ మూవీ షూట్ కోసం అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. గత ఏడాది సమంత కమిటైన సినిమాలలో హాలీవుడ్ దర్శకుడు రూపొందించనున్న ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమా కూడా ఉంది.
Samantha: దీని కోసమే సమంత అమెరికాకి వెళ్లిందట.
ఇందులో సమంత లెస్బియన్‌గా కనిపిస్తుందని ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఈ మూవీ షూట్ అమెరికాలో ప్రారంభం అయిందని తెలుస్తోంది. దీని కోసమే సమంత అమెరికాకి వెళ్లిందట. కానీ, అందరు మాత్రం తనకి ఆరోగ్యం బాగోలేక ట్రీట్‌మెంట్ తీసుకోవాలని అలాగే, అక్కడ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని రావాలని ప్లాన్ చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియాలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు.