Samantha: సాధారణంగా హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవా అయితే చెప్పాలి. హీరోయిన్ కుష్బూ నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. అయితే ఎక్కువగా తమిళంలో ఇలా హీరోయిన్లకు గుడులు కట్టేవారు అయితే ప్రస్తుతం తెలుగులో కూడా హీరోయిన్లకు గుడికట్టే ఆనవాయితీ వెలుగులోకి వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి చెప్పాల్సిన పనిలేదు. సమంత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఏకంగా సమంతకు గుడి కట్టేశాడు.
బాపట్లకు చెందిన సందీప్ అనే అభిమాని సమంత పై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణంలోనే ఆమెకు గుడి కట్టించి ఆమె పుట్టిన రోజు ఏప్రిల్ 28వ తేదీ ఈ గుడిని ప్రారంభించారు.సందీప్ తన గ్రామంలో ఉన్నటువంటి వారికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు సమంత విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరిపారు. ఇలా సమంత పై ఉన్న అభిమానంతోనే తాను తన ఇంటి ఆవరణంలో తనకి గుడి కట్టానని తెలిపారు.
Samantha: ఆరు లక్షలు…
ఇక సమంతకు గుడి కట్టడానికి సందీప్ ఎంత ఖర్చు చేశారు ఏంటి అనే విషయానికి వస్తే గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం సందీప్ దాదాపు 6 లక్షల రూపాయల వరకు సమంత గుడి నిర్మాణం కోసం ఖర్చు చేశారని తెలుస్తోంది. అయితే ఇంత ఖర్చు చేసే సమంతకు గుడి కట్టించాల్సిన అవసరం ఏంటి అనే విషయానికి వస్తే….సమంత ప్రత్యూష ఫౌండేషన్ నిర్మించి ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తనపై ఉన్న ఈ అభిమానంతోనే తనకు గుడి కట్టించానని సందీప్ తెలియచేయడం విశేషం.