Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత కారణాలవల్ల తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే చికిత్స కోసం అమెరికా వెళ్లబోతున్నారు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి పలు వెకేషన్ లకు వెళుతూ సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నటువంటి సమంత కెరియర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొందంటూ తాగా ఒక వార్త వైరల్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో తాము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలియజేశారు. అయితే మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి సమంత తన ఖర్చులకోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు అదేవిధంగా పలు యాడ్స్ కూడా చేశారు. ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఓ డైరెక్టర్ తనని కమిట్మెంట్ అడిగారని తెలుస్తోంది.

Samantha: సమంతను కమిట్మెంట్ అడిగారా…
ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఏకంగా తన గదికి రావాలి అంటూ ఆ డైరెక్టర్ సమంత పట్ల వ్యవహరించిన తీరుతో సమంత తిరిగి చదువుపై దృష్టి పెడుతూ మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నారట అయితే ఆ సమయంలోనే డైరెక్టర్ గౌతమ్ మీనన్ తనకు ఏం మాయ చేసావే సినిమాలో అవకాశం కల్పించారు. ఈ విధంగా ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నటువంటి సమంత వద్దకు అదే డైరెక్టర్ వచ్చి తన సినిమాలో నటించాలనీ తన కథ వినాలని ప్రాదేయపడ్డారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.