Samantha: లీడర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన రానా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు పొందాడు . హీరో అని మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్రలోనైనా నటిస్తూ ఉంటాడు. హీరోగా విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రానా ఎల్లప్పుడూ వైవిధ్యమైన పాత్రలలో నటించటానికి ఆసక్తి చూపుతూ ఉంటాడు. ప్రస్తుతం హీరో వెంకటేష్ తో కలిసి “రానా నాయుడు” అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్ మార్చి 10న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్ కు రీమేక్ గా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ పనులలో ప్రస్తుతం రానా బిజీగా ఉన్నాడు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్లో భాగంగా రానా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సమంత ఆరోగ్యం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా..” తమ వ్యక్తిగత సమస్య గురించి బహిరంగంగా చెప్పినప్పుడు నటీనటులు ప్రజల గొంతుకగా మారగలరా అని యాంకర్ ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరికి తమ స్వంత అభిప్రాయం ఉంటుందని.. ప్రతి ఒక్కరు దాని గురించి ఎలా మాట్లాడతారు.. మిగతవారు మాట్లాడేప్పుడు ఎలా ఉంటుందనేది ముఖ్యమని రానా చెప్పుకొచ్చాడు.
Samantha ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు ఉంటుంది…
ఇక సమంత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియగానే ఆమెను సంప్రదించాను. మేము ఎప్పుడూ అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాము. ఎవరి జీవితం సాఫీగా సాగిపోదు.. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేది ఒకటి ఉంటుంది. అది ఆరోగ్య సమస్య కూడా కావచ్చు. అలాంటి సమయంలో మనం ఎలా వ్యవహరిస్తాము.. దాని గురించి ఎలా స్పందిస్తామనేది ముఖ్యం. ఈ సమస్యల గురించి అందరూ విచారంగా కూర్చుని మాటాడుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో అప్పుడప్పుడు విచారించే విషయాలు జరగడం కూడా ముఖ్యమే. ఆత్మవిశ్వాసంతో తిరిగి లేచి ముందుకు సాగడమే ముఖ్యం” అంటూ రానా చెప్పుకొచ్చారు.