Samantha: నటి సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె మాత్రం తాను నటించడం కృషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ఈమె మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత నటుడు విజయ్ దేవరకొండతో కలిసి వేదికపై అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సమంతం అనంతరం సినిమా గురించి కూడా మాట్లాడారు.
ఈ వేదికపై సమంత సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు. తాను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని మీ అందరితో కలిసి సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమాని థియేటర్లో చూడాలని ఎదురుచూస్తున్నాను అంటూ తెలిపారు. ఇందులో ప్రతి ఒక్క పాట తనకు ఎంతో అద్భుతంగా నచ్చాయని సమంత తెలియజేశారు.ఇక తన ఆరోగ్యం గురించి కూడా ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం ఈ సమస్య నుంచి బయట పడటానికి హార్డ్ వర్క్ చేస్తున్నానని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అంటూ సమంత తెలియజేశారు.

Samantha: సమంతను అలా విమర్శించారా…
ఇకపోతే ఈ వేదికపై సమంత మాట్లాడుతూ తనను విమర్శించిన వారికి పరోక్షంగా భారీగానే కౌంటర్ వేశారని తెలుస్తోంది.ఈ వేదికపై సమంత మాట్లాడుతూ దేవుడి దయవల్ల తాను విజయవాడ సెంటర్లో ఇడ్లీ స్టాల్ పెట్టుకొని పరిస్థితికి ఇంకా రాలేదు అంటూ ఈమె మాట్లాడారు. ఇలా సమంత మాట్లాడటానికి కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. బహుశా సమంత అనారోగ్యానికి గురైన సమయంలో ఎవరైనా తనని ఇలాంటి మాటలతో విమర్శలకు గురి చేశారా అందుకే సమంత ఆ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా సమంత తన పట్ల విమర్శలు చేసిన వారికి తన స్టైల్ లో భారీగానే కౌంటర్ ఇస్తున్నారని చెప్పాలి.