Samantha: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప. గత ఏడాది విడుదలైన ఈ సినిమా విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్ని భాషలలో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో అల్లు అర్జున్ మేనరిజం, రష్మిక అద్భుతమైన నటన ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ డీ గ్లామర్ పాత్రలో నటించి విశేషమైన ఆదరణ పొందిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా విజయంపై ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటుడు భానుచందర్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలోని ప్రతి ఒక పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాల్లో తన చూపిస్తున్నాయని వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలోని సమంత నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా సాంగ్ వల్లే ఆ సినిమా అంత సక్సెస్ అయిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Samantha: సమంత కు వరుస అవకాశాలు వస్తున్నాయి…
సమంత ఈ సినిమాలో ఒక పాటలో నటించడం వల్ల తమిళం మలయాళం భాషలలో కూడా ఈ సినిమా మంచి పాపులారిటీ సంపాదించుకుందని తెలిపారు. ఈ సినిమాకు సమంత ఐటమ్ సాంగ్ ప్లస్ పాయింట్ అయ్యిందని భానుచందర్ వెల్లడించారు.లైమ్ లైట్ లోకి కావాలంటే ఆ మాత్రం నటించాల్సి ఉంటుందని పరోక్షంగా ఆయన సమంత ఐటెం సాంగ్ పై కామెంట్లు చేశారు. ఈ పాట సక్సెస్ కావడంతో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని ఇతర భాషలలో కూడా అవకాశాలు వస్తున్నాయని భానుచందర్ వెల్లడించారు. ఆరోగ్యం గురించి కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని మనకు ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్న ఆరోగ్యం బాగా లేకపోతే పేరు ప్రతిష్టలు మనల్ని కాపాడే లేవని తెలిపారు.