Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె మాత్రం తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం పలు దేశాలు వెళ్తూ పెద్ద ఎత్తున ఈమె తన వ్యాధి కోసం చికిత్స తీసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్లాక్ బికినీ ధరించి భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు చెమటలు పట్టిస్తున్నారు.
సమంత బ్లాక్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈ ఫోటోలు చూసి సమంత ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బజార్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై సమంత ఫొటోలు పబ్లిష్ అయ్యాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో అదిరిపోయింది. బికినీ లాంటి డ్రెస్ లో హాట్ క్లీవేజ్ షోతో అందాల ప్రదర్శన చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పాలి. ఇలా బ్లాక్ బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈమె తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో విషయాలను వెల్లడించారు.
పెళ్లి విషయంలో ఫెయిల్ అయ్యాను…
ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని ఈ సందర్భంగా సమంత తెలిపారు. ఒకవైపు విడాకులు తీసుకొని వివాహ బంధంలో తాను ఫెయిల్ అయ్యానని అలాంటి సమయంలోనే కెరియర్ పై ఫోకస్ పెట్టి వరుస సినిమాలలో నటించగా సినిమాలు కూడా ప్లాప్ అవడంతో తనని ఎంతగానో కలవరపెట్టాయని సమంత తెలియజేశారు. ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న సమయంలోనే తాను అనారోగ్యానికి గురి అయ్యానని ఇలా గత రెండు సంవత్సరాలుగా తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నానంటూ ఈ సందర్భంగా సమంత చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సమంత మాత్రం ఉన్నఫలంగా ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ అవుతుంది.