మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను: సమంత

Akashavani

సినీ లవర్స్ కి సమంత గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన అందంతో ఎంతమంది తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ప్రస్తుత తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఒక రేంజ్ లో వెలిగిపోతుంది. ఇక పుష్ప సినిమా సక్సెస్ తో ఈ అమ్మడి ఫాలోయింగ్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోయింది.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిన సమంత చేతి నిండా సినిమాలతో కెరీర్ పరంగా మూడుపువ్వులు ఆరు కాయలు లాగా ముందుకు వెళుతుంది. ఇదే క్రమంలో బాలీవుడ్లో కూడా పలు సినిమాలకు సైన్ చేసింది. అంతేకాకుండా హాలీవుడ్లో కూడా ఈ ముద్దుగుమ్మ అడుగు పెట్టినట్లు టాక్ నడుస్తుంది. ఇక తాజాగా పుట్టినరోజు జరుపుకున్న సమంత కు తన అభిమానులు, కో యాక్టర్స్ బర్త్డే విషెస్ తెలిపారు.

ఇక సమంత నటించిన కాతు వక్కుల రెందు కాదల్‌ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ ను అందుకుంది. ఇక పుట్టినరోజు నాడే ఈ రెండూ కలిసి రావడంతో సమంత ఒక రేంజ్ లో చిల్ అయ్యింది. తనకు బర్త్డే విషెస్ చేసిన ప్రతి ఒకరికి ఇన్ స్టాగ్రామ్ స్టోరీ రూపంలో అందరికీ ధన్యవాదాలు తెలిపింది.

samantha: సమంత రుణపడి ఉన్నది వీళ్లకే..!

అంతేకాకుండా చివరిలో పుట్టినరోజు నాడు నా పై అభిమానం చూపిన అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం ప్రేరణ నాపై ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను ఇంతగా అభిమానిస్తున్న నా అభిమానులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని సమంత తన స్టోరీలో మెన్షన్ చేసింది.

ఇక ప్రస్తుతం సమంత రాబోయే సినిమాల విషయానికొస్తే.. యశోద చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం దాదాపు షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శాకుంతలం మూవీ లో కూడా సమంత నటిస్తుంది. ప్రస్తుతం సమంత ఈ రెండు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నట్లు తెలుతుంది.

- Advertisement -