Samantha – Naga Chaitanya: సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఈ జంట ప్రస్తుతం ఎవరి సినిమా పనులలో వారు నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. సమంత వ్యక్తిగత కారణాలవల్ల ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని రోజులపాటు సినిమాకి దూరంగా ఉండాలని ఒక ఏడాది పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నటువంటి సమంత తన వ్యాధి కోసం పలు రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు.
ఇకపోతే తాజాగా సమంత నాగచైతన్యకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య నటించిన సినిమాలో సమంత నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఒకసారి కూడా కలిసి కనిపించని ఈ జంట ఏకంగా సినిమాలలో నటించడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు అయితే నాగచైతన్య సినిమాలో సమంత అంటే స్వయంగా ఆమె నటించలేదు ఆమె నటించిన సినిమాలోని కొన్ని డైలాగ్స్ నాగచైతన్య సినిమాలో తీసుకుంటున్నారట.
చైతన్య సినిమాలో సమంత డైలాగ్స్….
ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ చందు మొండిటితో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది ఈ సినిమాలో సాయి పల్లవి కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత నటించిన రంగస్థలం సినిమాలోని కొన్ని డైలాగ్స్ వాడుకోబోతున్నారని తెలుస్తుంది. ఇలా సమంత రంగస్థలం సినిమా డైలాగ్స్ ఈ సినిమాలో పెడతాము అని చెబితే నాగచైతన్య అభ్యంతరం చెబుతారేమోనని డైరెక్టర్ భావించారు అయితే తనకి ఎలాంటి అభ్యంతరం లేదని నాగచైతన్య చెప్పడంతో డైరెక్టర్ కూడా షాప్ అయ్యారట ఇలా నాగచైతన్య సినిమా కోసం సమంత డైలాగ్స్ వాడుతున్నారని తెలియడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.