Samantha – Naga Cahaithanya: సమంత నాగ చైతన్యను టార్గెట్ చేస్తున్నట్టే..లేకపోతే ఈ ఒక్కరోజు గ్యాప్ ఏంటీ..?

G K

Samantha – Naga Cahaithanya: సమంత నాగ చైతన్యను టార్గెట్ చేస్తున్నట్టే..లేకపోతే ఈ ఒక్కరోజు గ్యాప్ ఏంటీ..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామ్ డైరెక్ట్‌గా చైను టార్గెట్ చేయకపోయినా సినిమాలతో మాత్రం గట్టుగానే బాక్సాఫీస్ వద్ద పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుందని అర్థమవుతోంది. సమంత – నాగ చైతన్యలు విడిపోయాక మళ్ళీ మాట్లాడుకున్న సందర్భాలేవీ కనిపించలేదు. ఎవరి దారిన వారు సినిమాలు కమిటవుతూ..అవి పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవల సమంత నటించిన మల్టీస్టారర్ సినిమా కణ్మని రాంబో ఖతీజా వచ్చి నిరాశపరిచింది.

దాంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఏకంగా నాగ చైతన్య నటించిన బాలీవుడ్ స్ట్రైట్ సినిమా లాల్ సింగ్ చద్దా చిత్రానికి తన తాజా చిత్రం యశోదను పోటీగా దింపుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫిస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సమంత లుక్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఆకట్టుకుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలవనుందని ఫస్ట్ గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. హరి – హరీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Samantha – Naga Cahaithanya: యశోద చిత్రాన్ని రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసింది..!

ఈ సినిమాలో సమంతతో పాటుగా వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక నాగ చైతన్య – ఆమిర్ ఖాన్ – కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ, కోవిడ్ వల్ల ఆర్ఆర్ఆ, కేజీఎఫ్ 2 చిత్రాల వల్ల పోస్ట్ పోన్ అయిఫైనల్‌గా ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టుగా తెలుపుతూ అధికారికంగా కూడా డేట్‌ను కన్‌ఫర్మ్ చేసింది చిత్రబృందం.

అయితే, ఈ సినిమాకంటే ఒక్కరోజు ముందు అంటే ఆగస్ట్ 12నే సమత తన యశోద చిత్రాన్ని రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను కూడా కన్‌ఫర్మ్ చేశారు. దాంతో సమంత ఇలా చైతూను టార్గెట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

- Advertisement -