Samantha- Naga Chaitanya: నాగచైతన్య, సమంత అంటే తెలియని వారుండరు. ఒకప్పుడు ఈ జంట టాలీవుడ్ లో బెస్ట్ లవ్లీ కపుల్ గా పేరొందింది. అయితే నాగ చైతన్య జోష్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా..ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.. అయితే ఏం మాయ చేసావే సినిమాతో సమంత తో నటించాడు.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే సమంత ఈ సినిమాతో పరిశ్రమకు పరిచయమయ్యింది. ఈ సినిమా సమయం లోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఈ జంట ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తిరుగులేని స్టార్స్ గా మారారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం రాణిస్తున్నారు వీళ్ళిద్దరూ. సమంత నాగ చైతన్య ల జంట ప్రస్తుతం ఇండస్ట్రీలో లో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఏమాయ చేశావే సినిమాతో పరిచయమై ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షం లో 2017 లో వివాహం చేసుకున్నారు.
వివాహం చేసుకున్నప్పటి నుంచి ఈ దంపతులు చాలా ప్రేమగా ఉన్నారు. వీరి పెండ్లి జరిగి సరిగ్గా నాలుగు సంవత్సరాలకు ఏమైందో ఏమో ఎవరికి తెలియదు సమంతా నాగచైతన్య ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట విడాకులు తీసుకొని 11 నెలలు కావస్తున్నా విడాకులు తీసుకోవడానికి గల కారణం సరిగ్గా ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
అయితే ఆ తర్వాత సమంత అలాగే అక్కినేని ఫ్యామిలీ సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే సమంత పుష్ప లో ఐటమ్ గర్ల్ గా చేసి ఫుల్ ఫేమస్ అవ్వగా.. అటు నాగ చైతన్య ఒకేసారి రెండు హిట్ లు సాధించాడు. బంగార్రాజు అలాగే లవ్ స్టోరీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. కాకపోతే ఇక పూర్తిగా సమంత ఇంటి నుంచి వెళ్ళిపోయాక నాగచైతన్య కు అలాగే ఆ ఫ్యామిలీ కు దరిద్రం పట్టినట్టుంది.
Samantha- Naga Chaitanya: సమంత వల్ల అక్కినేని సినిమాలు ఫ్లాప్..
ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. అయితే నాగచైతన్య బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతూ.. చేసిన సినిమా లాల్ సింగ్ చడ్డ, థాంక్స్ యూ..ఫ్లాప్ అవ్వగా.. నాగార్జున నటించిన ది ఘోస్ట్..అమల నటించిన ఒకే ఒక జీవితం యావరేజ్ టాక్ ను తెచ్చుకున్నాయి. అయితే సమంత వెళ్లిపోవడం వల్లే ఈ ఫ్యామిలీ కు దరిద్రం పట్టిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.