Samantha: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే నాగార్జున బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ త్రీ నుంచి ప్రతి ఒక్క సీజన్ కి నాగార్జున హోస్ట్. అదేవిధంగా నాన్ స్టాప్ కార్యక్రమానికి కూడా ఈయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు తదుపరి సీజన్ కి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇకపోతే సీజన్ 6 కి కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుందని ఈ కార్యక్రమం పై ఆసక్తి ఉన్న వాళ్లు వెంటనే అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నాగార్జున వీడియో ద్వారా తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కార్యక్రమానికి ఇన్నిరోజులు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జునకు బిగ్ బాస్ గట్టి షాక్ ఇచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నాగార్జునని కాకుండా సమంతను తీసుకోవాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Samantha: నాగార్జునకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్
ఈ క్రమంలోనే ఈ విషయంపై సమంతను సంప్రదించగా సమంత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియా వేదికగా సమంత కమింగ్ సూన్ అంటూ చేసిన పోస్ట్ బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసేసింది అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఒకరోజు సమంత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే సమంతను ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా తీసుకోవాలని నిర్వహకులు భావించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సమంత నాగ్ మామకు గట్టి పోటీ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.