Samantha -Preetham: దక్షిణాధి సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటి సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత తన పూర్తి దృష్టిని సినిమాల పై ఉంచి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా యశోద సినిమా కూడా చివరిదశ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా ఈమె తన స్నేహితులు సాధన సింగ్, డిజైనర్ ప్రీతమ్ తో పాటు డేట్ నైట్ కి వెళ్లినట్లు సమంత సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అక్కినేని అభిమానులు మరోసారి ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Samantha -Preetham: ప్రీతమ్ తో డేట్ నైట్ లో సమంత…
సమంత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగు సంవత్సరాలపాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట పలు కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోగా సమంత విడాకులకు కారణం తన డిజైనర్ ప్రీతమ్ అని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఈ విధంగా సమంత తన డిజైనర్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సమంత ఇలా మరోసారి ప్రీతమ్ తో కలసి డేట్ నైట్ కి వెళ్లడంతో అక్కినేని అభిమానులు ఈమె వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.