Samantha: చైతూ మాత్రమే కాదు రెండో పెళ్లికి సమంతను సర్వం సిద్ధం… అలాంటి వరుడు దొరకాలంతే!

Akashavani

Samantha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగా గడుపుతున్నారు. ఇలా ఒంటరిగా గడుపుతున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ పై ఫోకస్ పెట్టారు.ఇక ఈమె విడాకులు తీసుకున్న అప్పటినుంచి ఈమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇదిలా ఉండగా తాజాగా గత కొద్ది రోజుల క్రితం వరకు నాగచైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇప్పటికే నాగార్జున నాగ చైతన్య కోసం ఒక అమ్మాయిని వెతికారని త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరుగుతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.

కేవలం నాగచైతన్య మాత్రమే కాదు సమంత కూడా రెండో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం వార్తలు వినపడుతున్నాయి. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం ఒంటరిగా గడుపుతోంది. ఇలా ఒంటరిగా గడుపుతున్న సమంతకు తోడు అవసరమని భావించిన ఆమె తల్లిదండ్రులు సమంతను పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సమంత తన తల్లిదండ్రుల తనపై అధిక ఒత్తిడి తీసుకురావడంతో రెండవ పెళ్లి చేసుకోవడానికి తాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Samantha: ఆ బాధ్యత తల్లిదండ్రులదే….

అయితే ఈసారి మాత్రం తనకు కాబోయే వరుడును వెతికే బాధ్యతను పూర్తిగా తన తల్లిదండ్రులకి అప్ప చెప్పారట.తనని అర్థం చేసుకొని తన కెరీర్ని ప్రోత్సహించే వరుడు దొరికితే తప్పకుండా తాను పెళ్లి చేసుకుంటానని సమంత తన తల్లిదండ్రులకు మాట ఇచ్చారట.అయితే ప్రస్తుతం తన కెరియర్ పరంగా బిజీగా ఉన్న సమంత కొద్ది రోజుల అనంతరం పెళ్లి చేసుకుంటానని, అంతవరకు తనకు కొంత సమయం కావాలని తల్లిదండ్రులని వేడుకున్నట్లు తెలుస్తోంది. ఈసారైనా సమంతను అర్థం చేసుకునే వాడు తన ఎదుగుదలను ప్రోత్సహించేవాడు దొరకాలని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి అలాంటి వాడు ఎక్కడున్నాడు సమంతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

- Advertisement -