Samantha: అందరూ అనుకున్నది నిజం అయ్యే అవకాశం ఉందని తాజాగా విడుదలైన కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ప్రోమో చూస్తే అర్థమవుతోంది.ఇప్పటికే, ఈ టాక్ షో బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ గా 6 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా 7వ సీజన్ మొదలవబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్స్అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్, రణ్వీర్ సింగ్, ఆలియా భట్, కృతి సనన్ అలాగే..టాలీవుడ్ స్టార్స్ సమంత, విజయ్దేవరకొండ పాల్గొన్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ షో మొదలవుతుందంటే ఖచ్చితంగా సమంత వ్యక్తిగత విషయాలను కరణ్ బయటకు లాగిఉంటాడనే టాక్ మొదలైంది.
అది నిజమనే తాజాగా విడుదలైన కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా మిగతా సెలబ్రిటీస్ కంటే కూడా కరణ్ సమంత,నాగ చైతన్యల వైవాహిక జీవితం గురించే ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. అయితే, సమంత కూడా ఏమాత్రం ఆలోచించకుండా కరణ్‌కు గట్టిగానే కౌంటర్ఇచ్చింది. ఈ విషయం కూడా తెలుస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా లేకపోవడానికి కారణం నువ్వే అంటూ కరణ్‌కు కౌంటర్ ఇచ్చింది. దీనికి కారణంఆయన సినిమాలే. కరణ్ జొహార్ కభీ ఖుషీ కభీ గమ్ లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తీసిన సంగతి తెలిసిందే.

Samantha: రియల్ లైఫ్ ఎప్పుడూ కేజీఎఫ్ సినిమాలా ఉంటుంది..!
అయితే, రియల్ లైఫ్ ఎప్పుడూ ఇలా ఉండదని, కేజీఎఫ్ సినిమాలా ఉంటుందని సామ్ కరణ్‌కు చెప్పింది. అంటే తానూ ఇలాంటి సినిమాలను చూసిఅందమైన జీవితం ఊహించుకున్నాననే విషయాన్ని స్పష్ఠంగా తెలిపినట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూబాగా వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లోనూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కాగా, సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్‌కురెడీ అవుతున్నాయి. ఇక ఇటీవల విజయ్ – లోకేష్ కనగరాజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.