Samantha: విడాకులు భలే కలిసోచ్చాయిగా.. ఆ సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న సమంత!

Akashavani

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత పలు స్టార్ హీరోల సరసన నటించి నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఇక సమంత ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ద్వారా ఈ అమ్మడు క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో వెలుగుతుంది. పుష్ప సినిమా అంతా ఒక ఎత్తు అయితే అందులో సమంత చేసిన స్పెషల్ సాంగ్ మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఆ సాంగ్ లో సమంత తన అందాన్ని సైతం ఆరబోసి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని మరో లెవెల్ ఆకట్టుకుంది.

ఇక పలు వెబ్ సిరీస్ లో తీసుకుంటూ బాలీవుడ్ ప్రేక్షకులతో కూడా మంచి ర్యాపో పెంచుకుంటుంది సమంత. మొత్తానికి సమంత కెరియర్ పరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక ఈ క్రమంలో సమంత రెమ్యూనేషన్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా భారీ స్థాయిలో మూట కట్టుకుంటుంది.

Samantha: విడాకులు భలే కలిసోచ్చాయిగా.. ఆ సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న సమంత!
Samantha: విడాకులు భలే కలిసోచ్చాయిగా.. ఆ సినిమాకు భారీగా డిమాండ్ చేస్తున్న సమంత!

Samantha: సమంత జత కట్టబోతున్న బాలీవుడ్ బడా హీరో ఇతడే!

ఈ నేపథ్యంలో సమంత తాజాగా బాలీవుడ్ బడా హీరో తో జత కట్టినట్టు తెలుస్తుంది. అది ఎవరో కాదు స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం సమంతకు వచ్చిందట. ఒక స్టార్ డైరెక్టర్ ప్రాణం పోసిన ఈ సినిమాలో సమంతతో పాటు ఒక బాలీవుడ్ హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా మేరకు ఇప్పటికే సమంతతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సమంత డిమాండ్ చేసిన రెమ్యూనేషన్ విషయానికొస్తే ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.

- Advertisement -