Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సమంత ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఈమె పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా పలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా సినిమాల ద్వారా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్న సమంత కొన్ని విషయాలు ద్వారా భారీగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు.
సాధారణంగా సెలబ్రిటీలు ప్రమోట్ చేసే బ్రాండ్లను చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అవి ఆరోగ్యానికి మంచివైనా అందాన్ని మరింత రెట్టింపు చేసేవైనా పెద్ద ఎత్తున కస్టమర్లు కూడా వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు డబ్బు కోసం అనారోగ్యకరమైనటువంటి వాటిని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు.పోనీ ఆ ప్రాజెక్టులను వారు ఉపయోగిస్తారా అంటే వాటి వంక కూడా తిరిగి చూడరు. కానీ వాటిని భారీగా ప్రమోట్ చేస్తూ డబ్బులు పోగు చేసుకుంటున్నారు.
Samantha: ఉన్న డబ్బు సరిపోలేదా…
ఈ క్రమంలోనే సమంత సైతం అలాంటి అనారోగ్యకరమైనటువంటి ఒక బ్రాండ్ కు ప్రమోట్ చేయడం వల్ల ఈమె భారీ స్థాయిలో నెటిజెన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా సమంత పెప్సీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది ఇలాంటి హానికరమైన బ్రాండ్లను ప్రమోట్ చేయడంఏంటి సమంత అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఇప్పటివరకు సంపాదించిన డబ్బు సరిపోలేదా డబ్బు కోసం మరి ఇలాంటి చెత్త పని చేయడం అవసరమా….ఇవి అనారోగ్యమని తెలిసిన ప్రమోట్ చేయడం ఏంటి మరి దారుణంగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.