Samantha: సాత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇలా కొన్ని సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం ఒక ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కొంతకాలం క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆమె ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకొని కోలుకున్న తర్వాత మళ్లీ సినిమాలలో నటించటానికి సిద్ధమయ్యింది.
ప్రస్తుతం సమంత తన చేతిలో ఉన్న ఖుషి , సీటాడెల్ షూటింగులు పూర్తిచేసుకుని ఆమె సినిమాలకు విరామం ప్రకటించింది. అయితే సమంత తన ఆరోగ్యం మీద ఫోకస్ చేయటానికే ఇలా సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో సమంత తీసుకున్న చికిత్స వల్ల మయోసైటీస్ కొంతవరకు తగ్గినప్పటికీ ఇంకా పూర్తిగా నయం కాకపోవటంతో సమంత మళ్ళి చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె షూటింగ్ లతో ఇబ్బంది పడకుండా కొంతకాలం అమెరికాలోనే ఉంటూ చికిత్స తీసుకోవటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Samantha: ఎలాగైనా ముగింపు పలకాలి…
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ లో మరో మూడు రోజుల్లో కారవాన్ లైఫ్ మొదలవ్వబోతుంది అని పెట్టింది. అంటే ఇప్పట్లో ఆమె బయటకి వచ్చే అవకాశాలు లేవని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. ఇక తాజాగా మరో స్టోరీలో తన ఫోటోని షేర్ చేస్తూ.. చాలా కష్టమైన ఎక్కువ రోజులు ఈ ఆరు నెలలు, ఎలాగైనా దీనికి ముగింపు పలకాలి అని పోస్ట్ చేసింది. దీంతో ఎంత కష్టమైనా కూడా మయోసైటిస్ వ్యాధికి పూర్తిగా ముగింపు పలకాలని సమంత ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఆమె పూర్తిగా కోలుకొని మళ్ళీ సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.