Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత కారణాలవల్ల ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమాలకు దూరమైన ఈమె మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఈమె చివరిగా ఖుషి సినిమా తర్వాత ఇతర సినిమాలకు కమిట్ అవలేదు అయితే ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఇలా హీరో విజయ్ దేవరకొండ మాత్రమే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమంత మాత్రం ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారు. ఈ విధంగా సమంత ఈ సినిమా కోసం ముందుగానే కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని అయితే ఇందులో భాగంగా కోటి రూపాయలు బ్యాలెన్స్ ఉండగా ఆ కోటి రూపాయలు తనకు వద్దని నిర్మాతలకి రిటన్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే సమంత ఇలా కోటి రూపాయల రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
Samantha: ప్రమోషన్లకు దూరంగా ఉండడంతో…
ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో సమంత మాత్రం ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. ఇలా హీరోయిన్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటే ఆ సినిమాకు ఎంత మైనస్ అవుతుందో మనకు తెలిసిందే కానీ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి నిర్మాతలు సమంతను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా తనకు పూర్తిగా స్వేచ్ఛను కల్పించారు. అయితే సమంత కూడా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటంతో ఆమె తిరిగి ఆ కోటి రూపాయలను నిర్మాతలకు ఇచ్చారని తెలియడంతో సమంత మంచి మనసు పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.