Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి తెలియని వారంటూ ఉండరు . ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసి తన అభిమానులుగా మార్చుకుంది. అప్పటినుండి ఇప్పటివరకు వెనకడుగు వేయకుండా వరుస హిట్స్ అందుకుంటూ ముందుకి దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా వరుస అవకాశాలు అందుకుని బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల అనారోగ్యంతో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇక ప్రస్తుతం సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉంది.
ప్రస్తుతం సమంత సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇలా తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించే సమంతకు ఇటీవల ఒక నెటిజన్ ఒక సలహా ఇచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఈ విషయాన్ని బయట పెట్టింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో సమంత పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అలాగే నేటిజన్ చేసిన ట్వీట్ గురించి కూడా బయటపెట్టింది.
Samantha:మీకంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు…
ఇటీవల ట్విట్టర్ వేదికగా ..” ఇప్పుడు ఎవరో ఒకరితో డేటింగ్ చేయవచ్చు కదా అంటూ సమంతకి ఒక నెటిజన్ సలహా ఇచ్చాడు. ఈ ట్వీట్ కి సమంత స్పందిస్తూ.మీకంటే బాగా నన్ను ఇంకెవరు ప్రేమిస్తారు” అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది. అయితే సమంత ఇచ్చిన ఈ సమాధానానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మేం రెడీ అంటూ సమంత అభిమానులు కామెంట్ల వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.