Samantha: టాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత మయోసైటిసిస్ కారణంగా ఏడాదిపాటు సినిమాలకు సినిమాలకు దూరం కాబోతున్నారని విషయం మనకు తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం ఈమె అమెరికా వెళుతున్న నేపథ్యంలో ఏడాదిపాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకుండా పూర్తిగా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకొని క్షేమంగా రావాలని ఈమె సినిమాలకు కూడా కమిట్ అవలేదు అయితే సమంత మయో సైటిసిస్ వ్యాధికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం సమంత ఏకంగా ఒక స్టార్ హీరో వద్ద 25 కోట్ల రూపాయలు అప్పు చేసింది అంటూ ఓ వార్త సంచలనగా మారింది అయితే ఈ వార్త వైరల్ గా మారడంతో సమంత ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం 25 కోట్ల ఈ డీల్ ఏదో బాగలేదు అంటూ రియాక్ట్ అయ్యారు. మయోసైటిసిస్ కోసం అంత డబ్బు ఏమాత్రం ఖర్చు కాదని నేను చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.ఇక తాను అప్పు తీసుకున్నాన్న విషయం గురించి కూడా ఈమె స్పందిస్తూ ఇప్పటివరకు నేను సినిమాలలో నటిస్తే నాకు రాళ్లు రెమ్యూనరేషన్ గా ఇవ్వలేదు నా గురించి నేను సులభంగా జాగ్రత్తగా తీసుకోగలనని తెలిపారు.
Samantha: బాధ్యతగా వ్యవహరించండి..
మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని వేల మంది బాధపడుతున్నారు. ఇలా ఈ వ్యాధి గురించి తప్పుడు సమాచారాన్ని ఇస్తూ అందరిని భయానికి గురి చేయకండి. ఈ వ్యాధి విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించండి అంటూ ఈ సందర్భంగా సమంత తన గురించి వచ్చినటువంటి అసత్యపు వార్తలపై ఘాటుగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.