Samantha: సమాజం అబద్ధాలను నమ్ముతుందంటున్న సమంత.. ఆ కామెంట్స్ చైతూ గురించేనా?

Akashavani

Samantha: టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత పుష్ప సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో వెలుగుతుంది. ఆ సినిమాలో తన హావభావాలను బయట పెట్టి బీ టౌన్ ప్రేక్షకులను సైతం మరో లెవెల్లో ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.

మొత్తానికి సమంత టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటి గా ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు కెరీర్ పరంగా మూడు పువ్వులు ఆరు కాయలు లాగా దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూనే.. ఇంటర్నేషనల్ సినిమాల వైపు కూడా ఒక కన్నేస్తుంది. ఇక నాగ చైతన్యతో విడాకులైన తర్వాత ఈ అమ్మడు తన లైఫ్ పై బాగా ఫోకస్ పెట్టింది.

ఇక సమంత సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తన కెరియర్లో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలకు సింక్ అయ్యేలా కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తుంది. ఆ కొటేషన్స్ చూసేవారికి సమంత తన మనసులోని భావాలను పంచుకుంటుంది అన్నట్లు అనిపిస్థాయి. కొన్ని సమయాల్లో సమంత పంచుకునే కొటేషన్స్ ఎవరినో ఉద్దేశించి పెట్టింది అన్నట్లు అనిపిస్తాయి.

Samantha: సమాజం అబద్ధాలను నమ్ముతుందంటున్న సమంత.. ఆ కామెంట్స్ చైతూ గురించేనా?
Samantha: సమాజం అబద్ధాలను నమ్ముతుందంటున్న సమంత.. ఆ కామెంట్స్ చైతూ గురించేనా?

Samantha: సమంత సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇవే..

ఇక ఇదే క్రమంలో సమంత పంచుకున్న మరో కామెంట్.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రియులను ఆశ్చర్యపరిచే విధంగా మారింది. ఇంతకీ అదేమిటంటే? నిజాలు అరుదుగా బయటకు వస్తాయి. కానీ సమాజం అబద్ధాలే ఎక్కువగా నమ్ముతుంది. అంతే కాకుండా అలాంటి అబద్దాలు ఎక్కువగా వెలుగులోకి వస్తాయి అని సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తమకు తోచిన విధంగా సమంతను కామెంట్ల రూపంలో ప్రశ్నలు అడుగుతున్నారు. మరి కొందరు ఇదంతా నాగచైతన్య ను ఉద్దేశించి చేసిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -