Samantha: చాలా రోజులు ఆరోగ్య సమస్యతో బాధపడిన సమంత ఈ మధ్యనే మళ్లీ షూటింగ్ లతో బిజీ అయింది. తను నటించిన శాకుంతలం సినిమా కూడా రిలీజ్ కి దగ్గర పడుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 14న విడుదల కాబోతుంది. కానీ అందుకు తగ్గ రేంజ్ లో ప్రమోషన్స్ ఏవి కనిపించడం లేదని సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సినిమా సమర్పకుడు దిల్ రాజు అయినప్పటికీ ఎందుకో ప్రమోషన్ల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. సమంత ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతుంది. అదే జోనర్ నుంచి వస్తున్న శాకుంతలం కూడా మంచి వసూళ్లను రాబడుతుందని మొదటి వరకు ఆశించారు సినీ ప్రియులు. అందుకు కారణం మొన్న సినిమా ట్రైలర్ను విడుదల చేసినప్పటికీ మినిమం బజ్ కూడా క్రియేట్ కాకపోవటం.
అయితే ప్రస్తుతం ముంబైలో ఉన్న సమంత శాకుంతలం సినిమా గురించి అందులో తన పాత్ర గురించి ఒక వీడియో షేర్ చేసుకుంది. అది ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. సమంత ప్రస్తుతం శకుంతలం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో నేను శకుంతల పాత్రలో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కథలో శకుంతలకు చాలా నమ్మకాలు ఉన్నాయని ఆమె తన ప్రేమలో భక్తిలోను ఎప్పుడూ నిజాయితీగా ఉంటుంది. తనకి ఎదురైనా కష్టనష్టాలని గౌరవంతో ఇష్టంతో దయతో భరించింది. తనకి వచ్చిన సమస్యలను నమ్మకంతో ఓర్పుతో ఎదుర్కొంది. ఇందులోని జంతువుల పాత్రలు నా చిన్నతనాన్ని గుర్తు చేశాయి.
Samantha:
ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది అంటూ ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో గౌతమి, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. హీరోగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు.