Samantha: సమంత ప్రస్తుతం ఆరోగ్యం మీద దృష్టి పెడుతూ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల ఖుషి, సీటాడెల్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో సమంత ఈ నిర్ణయం తీసుకుంది. ఒక ఏడాది కాలం పాటు తాను సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు సమంత స్వయంగా ప్రకటించింది. గతంలో మయోసైటీసిస్ వ్యాధితో బాధపడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవడానికి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత జీవితం అల్లకల్లోలం అయింది. మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమంత ఒకవైపు విహారయాత్రలు చేస్తూనే మరొకవైపు ఆధ్యాత్మిక సేవలోనూ మునిగిపోతోంది.
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత స్నేహితులతో కలిసి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శించింది. ఫేమస్ టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు కూడా చేసింది. ఆ తర్వాత మళ్లీ వరుస సినిమాలలో నటిస్తూ మామూలు స్థితికి చేరుకుంది. ఆ తర్వాత యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అయితే ఇప్పటికీ సమంత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకపోవడంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. ఈ క్రమంలో మళ్లీ పుణ్యక్షేత్రాలను దర్శిస్తోంది .
Samantha: ధ్యానం చేస్తున్న సమంత…
ఈ క్రమంలో తాజాగా సద్గురు ఇషా సెంటర్ లో జాయిన్ అయిన సమంత తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలను పంచుకుంది. ఈ ఫోటోలలో సమంత తెలుపు రంగు దుస్తులు ధరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెడిటేషన్ చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను షేర్ చేస్తే సమంత ఒక ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది. ” ధ్యానంతో శక్తిని నింపుకుంటున్నట్టు” ఆమె రాసుకొచింది. దీంతో ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత మళ్లీ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.