Samantha: సమంత ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది ఇండస్ట్రీలో అగ్రతారగా ఉన్న సమంత నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.నాగచైతన్యను పెళ్లి చేసుకోక ముందు పలు గ్లామరస్ పాత్రలలో నటించిన ఈమె అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత తన వస్త్రధారణలో పూర్తిగా మార్పులు చేసుకున్నారు. ఎంతో పద్ధతిగా ఉంటూ, గ్లామరస్ పాత్రలకు తావులేకుండా కథలను ఎంపిక చేసుకుని సినిమాలలో నటించేవారు.
ఈ విధంగా సమంత ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే సమంత తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉందని అనుకునేలోపు నాగ చైతన్యతో మనస్పర్థలు కారణంగా తన నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా సమంత నాగ చైతన్యతో విడాకులు ప్రకటన చేసిన తర్వాత తన నుంచి దూరంగా ఉంటూ పూర్తిగా తన కెరియర్ పై దృష్టి పెట్టారు. ఇలా సమంత ప్రస్తుతం వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరియర్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈమె నటించిన యశోద,శాకుంతలం సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Samantha: అభిమానులకు గ్లామర్ ట్రీట్..
ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో చేస్తున్నారు. ఈ విధంగా వరుస అవకాశాలు వస్తూ సమంత ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ షోకు ఉన్న పరిధులు కాస్త చెరిపేసి పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేనివారు ఇలా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సమంతకు చేతినిండా అవకాశాలు ఉన్నప్పటికీ ఇలా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఈ ఫోటోలు పై స్పందిస్తూ కేవలం సమంత నాగ చైతన్య పై కోపం కారణంగానే ఇలా అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.