Samantha – Taapse: ఇద్దరు ముదుర్లు కలిసి ఒకే ప్రాజెక్ట్ చేయడం అంటే కత్తి మీద సాము చేయాల్సిందే. రెండు ఒకత్తులు ఒకే ఒరలోఇమడవనేది ఎంత నిజమో..ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పోటీ పడకుండా ఉండలేరనేది అంతే నిజం. ఇప్పుడు సమంత – తాప్సీల మధ్య ఇలాంటిఇబ్బందులే తలెత్తాయని తాజా సమాచారం. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల, దర్శకులతో పనిచేసిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను.అయితే, తెలుగులో ఫ్లాప్స్ రావడంతో ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి.
దాంతో అమ్మడు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి అక్కడ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసి నిలదొక్కుకుంది. ఆ తర్వాత మంచి కథా ప్రాధాన్యం ఉన్నసినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంత చేసుకుంది. బాలీవుడ్‌లో తాప్సీ స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. మేకర్స్‌కు మంచిఛాయిస్‌గా మారిన తాప్సీ గత ఏడాది నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థలో మొదటి సినిమాగా బ్లర్ అనే సినిమాను నటిస్తూ నిర్మిస్తోంది. అజయ్
భల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాప్సీ నిర్మాణంలో స్టార్ హీరోయిన్ సమంత ఓ సినిమాను చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

Samantha – Taapse: సమంత నిర్మొహమాటంగా తాప్సీకి నో ..?
ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2తో బాలీవుడ్‌తో పాటు డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సమంత మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాంతో నేరుగా హిందీలో సమంత
సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటుందని అక్కడ మేకర్స్ తనకు కథలు వినిపిస్తున్నారని ప్రచారం జరుగింది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ చేస్తుంది
సమంత. సినిమాలు మాత్రం అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ కాలేదు. అయితే, తాప్సీ నిర్మాణంలో సమంత ఓ సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, స్టోరీ
విషయంలో సమంత – తాప్సీల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. దాంతో సమంత నిర్మొహమాటంగా తాప్సీకి నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది.