Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత సరైన హిట్ అందుకోలేకపోయింది. ఇక ఇటీవల ఆమె ఖుషి, సిటాడెల్ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సమంత తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం కోసమే ఇలా సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సమంత ఆరు నెలల పాటు సినిమాలకు దూరమై చికిత్స తీసుకుంది.
ఆ తర్వాత ఆ వ్యాధి నుండి కొంతవరకు కోలుకొని తాను సైన్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసింది. దీంతో కొంత కాలం సినిమాలకు విరామం ఇచ్చి వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మయోసైటిస్ నుండి సమంత పూర్తిగా కోలుకోలేదు. అందువల్ల మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లి కొంతకాలం అక్కడే ఉండి చికిత్స తీసుకొని మయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొద్దిరోజుల్లో అమెరికా ప్రయాణం ఉండగా సమంత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samantha గోల్డెన్ టెంపుల్ సందర్శించిన సమంత…
తాజాగా సమంత తమిళనాడు రాష్ట్రంలో గల వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ ని సందర్శించింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి ముందు మనోధైర్యం కోసం సమంత ఇలా పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా సమంత మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకొని మళ్లీ మునుపటిలాగే సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.