Samantha – Vijay devarakonda: స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న రొమాంటిక్
ఎంటర్‌టైనర్ ఖుషి. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఇప్పటికీ పవన్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ఖుషి సినిమా టైటిల్‌తోనే ఇప్పుడు సమంత, విజయ్ కలిసి సినిమా చేస్తుండటంతో మంచి బక్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే, కశ్మీర్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు..సాంగ్ కంప్లీట్ చేశారు. అక్కడ దాదాపు 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా షెడ్యూల్ వైజాగ్‌లో మొదలు పెట్టబోతున్నారట. శివ నిర్వాణ వైజాగ్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ రొమాంటిక్ సాంగ్‌ను సమంత – విజయ్ దేవరకొండలపై చిత్రీకరించనున్నారట. దీనితో మెజారిటీ భాగం ఖుషి సినిమా చిత్రీకరణ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ మధ్య కాలంలో సమంత బోల్డ్ సీన్స్ అంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.
Samantha – Vijay devarakonda: ఖుషి మాత్రం ఇద్దరి కెరీర్‌లో మైన్ స్టోన్ మూవీ..
దాంతో సమంత, విజయ్‌ల మధ్య ఘాటైన సన్నివేశాలు, అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ ఒకటి ఖుషి సినిమాలో కథా నేపథ్యంగా పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. గతంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమాలో సమంత, విజయ్ కలిసి నటించారు. కానీ, అది సినిమాలో వచ్చే పాత్రలుగానే మిగిలాయి. ఇక, ఖుషి మాత్రం ఇద్దరి కెరీర్‌లో మైన్ స్టోన్ మూవీలా నిలుస్తుందని అంటున్నారు. చూడాలి మరి సమంత, విజయ్‌ల రొమాన్స్ ఖుషిలో ఏ రేంజ్ లో ఉంటుందో.