Samantha: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిన మనకు తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్లో సమంత సందడి చేశారు. ఊ అంటావా మామ అంటూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని మారుమోగి పోయింది.
ఇక ఈ పాట ద్వారా సమంతకి కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ లభించడంతో ఈమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు అయితే తాజాగా ఈ పాట గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుకుమార్ ముందుగా ఈ పాటలో నటించడం కోసం సమంత కాకుండా మరొకసారి హీరోయిన్ ని సంప్రదించారని తెలుస్తుంది. మరి పుష్ప సినిమా కోసం సుకుమార్ సెలెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
Samantha: తమన్నా ఫస్ట్ ఆప్షన్..
ఈ స్పెషల్ సాంగ్ లో చేయడం కోసం సుకుమార్ ముందుగా టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నాని సంప్రదించారట. అయితే తమన్న అప్పటికే పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో తమన్నా ఈ పాటకు నో చెప్పారట అయితే ఈ పాటలో ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో అల్లు అర్జున్ సమంత పేరు సూచించారు అయితే అప్పటికి ఇంకా సమంత విడాకులు తీసుకొని కొన్ని రోజులు అయింది. అయితే సమంత నటిస్తుందా లేదా అన్న సందేహం ఉన్నప్పటికీ స్వయంగా అల్లు అర్జున్ సమంతకు ఫోన్ చేసి ఈ సినిమాలో నటించాలని తనని ఒప్పించారట.