Samantha: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఎప్పుడు అందరి ఫోకస్ తమపై ఉండేలా బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ ఖరీదైన దుస్తులు, వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటి ధర సామాన్యులకు మాత్రం ఆశ్చర్యాన్ని తాజాగా సమంత ధరించిన చెప్పుల ధర తెలిసి సామాన్య ప్రజలు నోరెళ్ళ పెడుతున్నారు. చెప్పుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న సమంత రేంజ్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ప్రస్తుతం సమంత ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్ళటానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చిన సమంత కెమెరా కంటికి చిక్కింది .
దీంతో ఎయిర్పోర్టులో ఉన్న సమంత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలలో సమంత ధరించిన చెప్పుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ఫోటోలలో సమంత లూయిస్ విట్టన్ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ చెప్పులను ధరించింది. ఈ చెప్పుల ధర గురించి గూగుల్ లో సెర్చ్ చేయగా అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే సమంత ధరించిన ఆ లూయిస్ విట్టన్ కంపెనీకి చెందిన చెప్పుల ధర అక్షరాల రూ.2.5 లక్షలు. కేవలం చెప్పుల కోసమే రెండున్నర లక్షల రూపాయలు వెచ్చించిన సమంత రేంజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Samantha: చెప్పులకు లక్షలు ఖర్చు చేసిన సమంత…
ఇదిలా ఉండగా ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సమంత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంతకి జోడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీమేక్‌లోనూ సమంత నటిస్తోంది.