Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో వీరిద్దరు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 4 సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.ఈ విధంగా విడాకులతో విడిపోయిన ఈ జంట ప్రస్తుతం తమ కెరీర్ పై పూర్తి దృష్టి పెట్టి ఇండస్ట్రీలో ఓ అగ్ర హీరో హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు.ఈ క్రమంలోనే నాగచైతన్యను పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం వల్ల సమంతకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉందనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సమంత ఒక సాధారణ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ట్ సెలబ్రిటిగా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎంతో పేరు పలుకుబడి ఉన్నటువంటి అక్కినేని వారసుడుని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె నాలుగు సంవత్సరాలుగా అక్కినేని కోడలిగా చలామణి అయింది. అక్కినేని కోడలు గా ఉన్నప్పుడు సమంతకు ఎంతో గౌరవ మర్యాదలు దక్కాయి.ఇకపోతే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత సమంత పేరు పక్కన అక్కినేని ట్యాగ్ కూడా తొలగిపోయింది.

Samantha: భవిష్యత్తును ఇబ్బందులలో పెట్టుకున్న సమంత…
ప్రస్తుతం అక్కినేని కుటుంబం నుంచి బయటకు వచ్చిన సమంత ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ సినిమాలలో నటిస్తూ భారీ ఎక్స్పోజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె అందాల ఆరబోతతో సినిమా అవకాశాలు రావడమే కాకుండా భారీ స్థాయిలో డబ్బు వెనకేసుకు ఉంటుంది. ప్రస్తుతం సమంత స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్నప్పటికీ మరికొన్ని సంవత్సరాలలో ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని,తను సాధారణ సెలబ్రిటీగా ఇండస్ట్రీలో కొనసాగడం కూడా కష్టతరమవుతుందని మరికొందరు భావిస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత ప్రస్తుతం లాభం పొందినప్పటికీ భవిష్యత్తులు ఎంతో నష్టపోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.