samantha-what-is-the-benefit-to-samantha-of-marrying-and-divorcing-nagachaitanya
samantha-what-is-the-benefit-to-samantha-of-marrying-and-divorcing-nagachaitanya

Samantha: సౌత్‌లో మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2తోనూ బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సమంత..ఇప్పుడు హీరోలకి ధీటుగా తన సినిమాల రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత మన హీరోలందరూ పాన్ ఇండియా స్టార్‌గా మారేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది అల్లు అర్జున్, రాం చరణ్, ఎన్.టి.ఆర్‌లకి మాత్రమే.

హీరోయిన్స్‌లో రష్మిక మందన్నకి మాత్రమే ఆ క్రేజ్ దక్కింది. అది కూడా పుష్ప సినిమాతో. ఇప్పుడు హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రాజెక్ట్స్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సమంత తన సినిమాలను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం సమంత నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్‌లోనే రిలీజ్ కాబోతోంది. అదే శాకుంతలం. గుణశేఖర్ దీనికి దర్శకుడు.

Samantha: పాన్ ఇండియా రేంజ్‌లో గట్టిగానే దెబ్బ కొడుతుంది.

ఇప్పటికే, ఈ మూవీ నుంచి పోస్టర్స్ రిలీజైయ్యాయి. కానీ, వీటికి ఆశించినంతగా బజ్ క్రియేట్ అవలేదు. ఇక యశోద అనే థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ టీజర్ అందరినీ బాగా ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాను సౌత్‌లోని అన్నీ భాషలలో అలాగే బాలీవుడ్‌తో పాటుగా మిగతా విదేశీ భాషలలోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సమంత ఓ హాలీవుడ్ సినిమా చేస్తోంది. ఈ క్రమంలోనే యశోద సినిమాను వరల్డ్ వైడ్‌గా పలు భాషలలో రిలీజ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారట. ఇది గనక హిట్ అయితే, స్టార్ హీరోలందరికీ సమంత పాన్ ఇండియా రేంజ్‌లో గట్టిగానే దెబ్బ కొడుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on అక్టోబర్ 2, 2022 at 4:30 సా.