Sameera Sherief తనపై అలా కామెంట్ చేశాడని సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసిన సీరియల్ హీరోయిన్….

Joythi R

Sameera Sherief మామూలుగా ఈ మధ్య సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగా కొందరు సినీ సెలబ్రిటీలు అప్పుడప్పుడూ తమకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలు వంటివి కూడా షేర్ చేస్తూ తమ అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు సెలబ్రిటీలపై అసభ్యకర కామెంట్లు చేయడం, దూషించడం వంటివి చేస్తూ సెలబ్రిటీల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ సీరియల్ నటి సమీరా షరీఫ్ కూడా తన ఫొటోలపై అసభ్యకరంగా కామెంట్లు చేసినటువంటి నెటిజన్ పై ఫైర్ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో నటి సమీరా షరీఫ్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకి బాగానే అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు సీరియల్ అప్డేట్లను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో తాజాగా నటి సమీరా షరీఫ్ మదర్స్ డే సందర్భంగా తన కొడుకుతో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సమీరా షరీఫ్ వెంటనే ఈ విషయంపై స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన పై అసభ్యకరంగా కామెంట్ చేసిన నెటిజన్ కామెంట్ ని సైబర్ క్రైమ్ పోలీసులుకి ట్యాగ్ చేసి నిన్ను సైబర్ క్రైమ్ పోలీసులు చూస్తున్నారని తొందర్లో నువ్వు పోలీసుల కస్టడీలోకి వెళ్ళబోతున్నావని రిప్లై ఇచ్చింది.

Sameera Sherief తనపై అలా కామెంట్ చేశాడని సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసిన సీరియల్ హీరోయిన్....
Sameera Sherief తనపై అలా కామెంట్ చేశాడని సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసిన సీరియల్ హీరోయిన్….

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ చేసిన ఈ పనికి అభినందిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీల కామెంట్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వాళ్లకి సైబర్ క్రైమ్ పోలీసులు కచ్చితంగా బుద్ధి చెబుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి సమీరా షరీఫ్ టాలీవుడ్ బుల్లి తెరపై దాదాపుగా డజనుకు పైగా ధారావాహికలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తన భర్తతో కలిసి ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళం తదితర భాషలలో పలు ధారావాహికలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తోంది. కాగా ఇటీవలే నటి సమీరా షరీఫ్ పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో ప్రస్తుతం షూటింగులకు బ్రేక్ ఇచ్చి ఇంటిపట్టునే ఉంటుంది.

- Advertisement -