Samudrakhani: నేను పవన్ కళ్యాణ్ అభిమానిని.. ఆయనతో త్వరలోనే సినిమా చేస్తా.. సముద్రఖని!

Akashavani

Samudrakhani: దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సముద్రఖని గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈయన ఆ గుర్తింపు తోనే కాకుండా గాయకుడు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తమిళంతో పాటు మలయాళం, తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. తెలుగులో చాలా వరకు నెగటివ్ పాత్రలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.

అంతేకాకుండా తెలుగులో శంభో శివ శంభో, జెండాపై కపిరాజు సినిమాలకు దర్శకత్వం వహించి వీటి ద్వారా కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. అంతేకాకుండా త్వరలో ఆయనతో సినిమా చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో బిజీగా ఉన్నాడు.

అంతేకాకుండా డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా కూడా చేయనున్నాడు. కానీ ఈ సినిమా కంటే ముందు పవన్ మరో సినిమా రీమేక్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అది కూడా తమిళ రీమేక్ సినిమా అని తెలిసింది.

 Samudrakhani: నేను పవన్ కళ్యాణ్ అభిమానిని.. ఆయనతో త్వరలోనే సినిమా చేస్తా.. సముద్రఖని!
Samudrakhani: నేను పవన్ కళ్యాణ్ అభిమానిని.. ఆయనతో త్వరలోనే సినిమా చేస్తా.. సముద్రఖని!

Samudrakhani: పవన్ కళ్యాణ్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన సముద్రఖని..

ఇక ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడట. ఇక ఈ విషయం గురించి సముద్రఖని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ‘వినోదయ సిత్తం’ రీమేక్ ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని.. నేను పవన్ కళ్యాణ్ అభిమానినే అని.. పక్క ఫ్యాన్ లా ఆ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాను అని.. త్వరలో గుడ్ న్యూస్ వింటారు అని క్లారిటీ ఇచ్చాడు.

- Advertisement -