Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంయుక్త ఆ తర్వాత బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాలలో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని లక్కీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్ని వరుసగా హిట్ అవటంతో ఇండస్ట్రీలో అవకాశాలు వరుస కడుతున్నాయి. దీంతో ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పనిచేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే సంయుక్త మీనన్ గురించి అనేక రూమర్లు వినిపించాయి. ఇక తాజాగా ఈ అమ్మడు ఒక తమిళ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోకి ఇదివరకే పెళ్లి అవటమే కాకుండా ఇటీవల భార్యకు కూడా విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఆ హీరోతో కలిసి ఒక సినిమాలో కూడా నటించినట్లు తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరోతో పరిచయం పెరిగి అతనితో ప్రేమలో పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Samyuktha Menon: ఆ హీరోతో ప్రేమ ప్రయాణమా…
దీంతో సంయుక్తని ప్రేమలో పడేసిన ఆ హీరో ఎవరా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా అసలు ఈ వార్తలలో నిజం లేదని మరి కొంతమంది సంయుక్త అభిమానులు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. ఇండస్ట్రీలో కొంచెం పేరు, ప్రఖ్యాతలు రాగానే హీరో హీరోయిన్ల గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని,సంయుక్త విషయంలో కూడా అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి సంయుక్త గురించి వినిపిస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి మరి.