Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తదుపరి బింబిసారా సార్ వంటి సినిమాలలో నటిస్తూ మరో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఈమె ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అయ్యారు.
ఈ విధంగా సంయుక్త నటించిన నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈమెకు తెలుగులో భారీ క్రేజ్ ఏర్పడింది ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు సంయుక్తను తమ సినిమాలలో తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇలా వరుస సినిమాలు హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారని తెలుస్తోంది. కెరియర్ మొదట్లో ఒక్కో సినిమాకు 60 నుంచి 70 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి సంయుక్త ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటిన్నర డిమాండ్ చేస్తున్నారట.
Samyuktha Menon: వరుస అవకాశాలతో బిజీగా సంయుక్త…
ఇలా నాలుగు సినిమాలు హిట్ అయ్యేసరికి కోటి రూపాయల రెమ్యూనరేషన్ పెంచడంతో దర్శక నిర్మాతలు సైతం షాక్ అవుతున్నారు.అయితే ఈమె సినిమాలలో నటిస్తే సినిమా హిట్ అని నిర్మాతలు భావించడంతో ఈమె అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట. ఏది ఏమైనా ఊహించని విధంగా సంయుక్త మీనన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇలా వరుస హిట్ సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆమెకు వరుస సినిమా అవకాశాలు రావడంతో ఎంతో బిజీగా ఉన్నారు.