Sarath Babu:సీనియర్ నటుడు శరత్ బాబు గత మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు హైదరాబాదులో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈయన అంత్యక్రియలు చెన్నైలో పూర్తి అయ్యాయి. ఇక శరత్ బాబు మరణించిన తర్వాత ఆయన ఆస్తులు గురించి గొడవలు జరుగుతున్నాయన్న వార్త వైరల్ అవుతుంది.శరత్ బాబు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ భారీగానే ఆస్తులను కూడబెట్టారు. అయితే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ సంతానం లేకపోవడం గమనార్హం.
ఇలా శరత్ బాబుకు వారసులు లేకపోవడంతో తన సోదరుల పిల్లలని తన పిల్లలుగా భావించి వారి బాధ్యతలను కూడా శరత్ బాబు తీసుకున్నారని తెలుస్తోంది. శరత్ బాబు మరణించక ముందే ఈయన బెంగుళూరు హైదరాబాద్ చెన్నైలో ఉన్నటువంటి ఇళ్లను పలు షాపింగ్ మాల్స్ అన్నింటిని కూడా తన సోదరీ సోదరుల పిల్లల పేరిట వీలునామ రాసారట తన మరణాంతరం ఆస్తి మొత్తం వారికే చెందాలని ప్రతి ఒక్కరికి సమానంగా ఈయన ఆస్తిని పంపిణీ చేశారని తెలుస్తోంది.
Sarath Babu : ఆస్తి మొత్తం వారికేనా..
ఇక శరత్ బాబు అనారోగ్యంతో మరణించడంతో ప్రస్తుతం ఈయన ఆస్తులు అన్ని కూడా వీలునామా ప్రకారం ఎవరి వాటా వారు తీసుకున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా ఇండస్ట్రీలో దాదాపు 300కు పైగా సినిమాలలో నటించిన శరత్ బాబు కొన్ని వందల కోట్ల రూపాయలను కూడా పెట్టి చివరికి తనకంటూ ఎవరూ లేకుండా తన ఆస్తిని ఇలా తన సోదరీ సోదరుల పిల్లల పేరిట రాయడం గమనార్హం